పవన్ కళ్యాణ్-‘పివిపి సినిమా' సినిమా లేటెస్ట్ ఇన్ఫో
హైదరాబాద్ : 'బలుపు' చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిని పివిపి సినిమా బేనర్ తాజాగా బంపర్ చాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో చేయబోయే ఈ చిత్రం జూన్ నుంచి మొదలు కానుందని సమాచారం. 2014 చివరి నెలలో ఈ చిత్రం విడుదల అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రం తర్వాత పివిపి బేనర్ సినిమా మొదలు కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా పకటించారు.
'పివిపి సినిమా' సంస్థ తెలుగువాడైన ప్రసాద్ వి పొట్లూరికి చెందినది కావడం గమనార్హం. ఫిల్మ్ ఫైనాన్సియర్‌గా ప్రారంభమైన ఈ సంస్థ తొలుత తమిళ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమిళంలో రాజపట్టై, వర్ణ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను తమిళంలో విడుదల చేసింది. వర్ణ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
రవితేజ హీరోగా రూపొందిన 'బలుపు' చిత్రంతో తెలుగు సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఈ సంస్థ తొలి ప్రయత్నంలో విజయాన్ని సొంతం చేసుకుంది. విజయోత్సాహంలో ఉన్న ఆ సంస్థకు వెను వెంటనే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కడం గమనార్హం.
అయితే పవన్‌తో చేయబోయే సినిమాకు ఏ దర్శకుడు పని చేయబోతున్నారు, హీరోయిన్ ఎవరు, సాంకేతిక నిపుణుల లాంటి వివరాలేవీ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ సంస్థలో పని చేయడానికి పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాత్రమే స్పష్టం అవుతోంది. గబ్బర్ సింగ్ 2 తర్వాత... పవన్ కళ్యాణ్ ఏ కథ ఓకే చేసినా, ఏ దర్శకుడిని ఎంపిక చేసినా.....ఆ సినిమా నిర్మాణ బాధ్యతను పివిపి సంస్థ తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications












