»   » ఇక పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు భారీగా...

ఇక పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు భారీగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమాజానికి తన వంతు సేవ చేయడంలో ఎప్పుడూ అందరి కంటే ఓ అడుగు ముందే ఉంటారనే విషయం కొత్తగా చెప్పాలిన అవసరం లేదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సాయం అందించి ఇతర స్టార్స్‌కు ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచిన సందర్భాలెన్నో..

అదే విధంగా పేద సినీ కళాకారుల సాయం అందించడం లోనూ, పేదల కోసం ఇతర సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ఇప్పటి వరకు అడపా దడపా పాలు పంచుకున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాను పెద్ద సంఖ్యలో చేపట్టబోతున్నారని, ఓ చారిటీ సంస్థను స్థాపించబోతున్నారని సమాచారం.

గతంలో కామెన్ మెన్ ప్రొటక్షన్ ఫోర్స్‌ను స్థాపించిన పవన్ కళ్యాణ్...ఆ సంస్థను మళ్లీ రీయాక్టివ్ చేయనున్నట్లు, దాని ద్వారానే సేవా కార్యక్రమాలు ఉదృతం చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ సొంత ప్రొడక్షన్ హౌస్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్ టాలెంటు ఉన్న కొత్త వారిని ఎంకరేజ్ చేయనున్నారు.

పవన్ కళ్యాన్ సినిమాల విషయానికొస్తే....త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్వకత్వంలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు.

English summary
Buzz is that Pawan has planned to launch his charitable works in a big way. Pawan is apparently unwilling to giveback to society, especially the poor and needy. And speak it has to Pawan is considering to revive the Force Protection common man too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu