బామ్మర్ధితో పవన్ కళ్యాణ్?
బావ అల్లు అరవింద్ తో పవన్ కళ్యాణ్ కి కొంతకాలంగా పడటం లేదని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ తన బావమరది...రేణు దేశాయ్ సోదరుడుతో ఓ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అందునిమిత్తం స్క్రిప్టు వర్క్ సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టుకు నిర్మాత ఆ కుర్రాడే అయినా పెట్టుబడి పెట్టేది మాత్రం పవన్ అంటున్నారు. గీతా ఆర్ట్స్ పై తనకు సినిమా చేయటం లేదని డైరక్టు గా చెప్పకుండా ఇలా ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నాడని చెప్తున్నారు. ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం ఓడిపోవటానికి..అల్లు అరవింద్ విధానాలే కారణమని భావిస్తూ..కొంత కాలంగా పవన్ పూణెలో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే డైరక్టర్ ఎవరన్నది నిర్ణయం చేయలేదు.రేణు దేశాయ్ సైతం ఈ కథా చర్చల్లో కీలక పాత్ర వహిస్తున్నట్లు చెప్తున్నారు. పూర్తిగా తన భావజాలాలకు అనుకూలంగా సినిమాని తీసి హిట్ కొట్టాలనే తలంపుతో పవన్ ఉన్నారని చెప్తున్నారు. కమర్షియల్ పేరిట కాన్సెప్ట్ చెడకొట్టకుండా జాగ్రత్తపడాలని తన స్టోరీ డిపార్ట్ మెంట్ కి ఆదేశించినట్లు చెప్తున్నారు. తనకిష్టమైన చేగువేరా సిద్దాంతాలు అంతర్గతంగా ఉండేలా ఈ సబ్జెక్టు తయారయ్యే అవకాశం ఉందని బయిట వినపడుతుంది. అయితే ఈ చిత్రం మాత్రం పూరీ తో పవన్ చేసే సినిమా అనంతరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ పులి చిత్రం హడావిడిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











