»   »  పుట్టినరోజు వేడుకలకు దూరంగా పవన్ కళ్యాణ్

పుట్టినరోజు వేడుకలకు దూరంగా పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సింప్లిసిటీనే ఇష్టపడతారు. సినిమా స్టార్స్ అందరూ తమ తమ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటున్నా...ఆయన మాత్రం ఇలాంటి వాటికి మొదటి నుండీ దూరంగానే ఉంటూ వస్తున్నారు. తాగా సెప్టెంబర్ 2న కూడా ఆయన ఎలాంటి వేడుక జరుపుకోవడం లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అసలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయన తిరిగి వస్తారని, అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పాల్గొంటారని సమాచారం.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత శరత్ మరార్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Pawan Kalyan to stay away from birthday celebrations

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు సంబంధించిన లోగోలతో పాటు ఈరోస్ సంస్థ లోగో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది.

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

English summary
Pawan Kalyan to stay away from birthday celebrations. He is going out of station for his birthday (2 September) and will not be available in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu