twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉగ్రరూపం.. ఆ మాటంటే చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్..

    |

    ఇటీవల సినిమా షూటింగ్ లలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారి పార్టీ వైసీపీపై ఈసారి ఘాటుగా విమర్శలు చేశారు. కొడకల్లారా.. వెధవల్లారా.. సన్నాసుల్లారా అంటూ పదాలు వాడుతూ చెప్పు చూపించారు. వైజాగ్ సంఘటనల తర్వాత విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్ మంగళవారం మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వైసీపీ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏకిపారేశారు. తనపై ప్యాకేజ్ స్టార్ అంటూ చేసిన విమర్శలపై ఘాటుగా సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్.

    తనపై చేసిన విమర్శలపై..

    తనపై చేసిన విమర్శలపై..

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అధినేతగా మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన సంఘటనల తర్వాత ఇవాళ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చెరుకున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

    చెప్పు తీసుకుని దవడ పగిలేలా..

    చెప్పు తీసుకుని దవడ పగిలేలా..

    తనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్న వైసీపీ నేతలపై పవన్ ఇంతకుముందు లేనంతగా విరుచుకుపడ్డారు. తనను ప్యాకేజీ స్టార్ అనే సన్నాసి నా కొడుకుల్ని చెప్పు తీసుకుని దవడ పగిలేలా కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే పళ్లు రాలగొడతానని చెప్పు చూపిస్తూ మరి హెచ్చరించారు.

    తమషాగా ఉందారా..

    ''ఈ ప్యాకేజీ స్టార్.. ప్యాకేజీ అనే సన్నాసీ నా కొడుకులు ఎవరు. చెప్పు తీసుకుని కొడతా ఒక్కొక్క వైసీపీ కొడుకుని. చెప్పు.. అటు తిప్పి.. ఇటు తిప్పి.. పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా కొడతా కొడకల్లారా ఒక్కొక్కన్ని. తమషాగా ఉందారా కొడకల్లారా.. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు తీసుకొని పళ్లు రాళగొడత కొడుకుల్లారా చెబుతున్నా..

    మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నార్రా..

    మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నార్రా..

    వైసీపీ సన్నాసుల్లారా.. చవటాల్లారా.. దద్దమ్మల్లారా.. నా సహనం రా.. నా సహనంకా మిమ్మల్ని ఇంతకాలం రక్షించింది. ఏరా వైసీపీ గుండాల్లారా.. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నార్రా.. రౌడీలు ఉన్నార్రా.. ఒంటిచేత్తో వచ్చి మెడ పట్టి తొక్కిపడేస్తా..'' అని గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

    ఫిక్స్ డ్ డిపాజిట్ తీసేసి మరి..

    తాను 8 ఏళ్లలో కేవలం 6 సినిమాలు చేశానని, వాటి ద్వారా రూ. 100 నుంచి రూ. 120 కోట్లు సంపాదించనని చెప్పుకొచ్చారు. జీఎస్టీ కాకుండా రూ. 34 కోట్ల 4 లక్షల 876 పన్ను కట్టానని, పిల్లల కోసం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్ తీసేసి మరి పార్టీ ఆఫీస్ కట్టానని తెలిపారు. జనసేన ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ. 17 కోట్ల 58 లక్షలు పార్టీ కార్పస్ ఫండ్ గా ఉందన్నారు.

     రైతు భరోసా కోసం రూ. 3 కోట్లు..

    రైతు భరోసా కోసం రూ. 3 కోట్లు..

    హుదు హుద్ తుపాను నుంచి సైనిక్ ఫండ్, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కలిపి రూ.12 కోట్లు, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇచ్చానని పేర్కొన్నారు. రైతు భరోసా కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెట్టానని, తన సేన కోసం తన వంతు ద్వారా రూ. 4 కోట్ల 32 లక్షల విరాళాలు వచ్చాయని లెక్కలు చెప్పారు పవన్ కల్యాణ్.

    సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ..

    సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ..

    ఇదిలా ఉంటే ఇటీవలే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ కు సంబంధించిన వర్క్ డిస్కషన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు, పవన్ కల్యాణ్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీలను..

    పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీలను..

    మాట్లాడితే 3 పెళ్లిళ్లు చేసుకున్నానంటారని ఆ 3 పెళ్లిల్లు ఎందుకు చేసుకోవాల్సిందే చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తనలా కాకుండా ఒకరిని పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీలను పెట్టుకునే సన్నాసులు అంటూ తీవ్రంగా విమర్శించారు. వైసీపీలో బాలినేని, ఆనం వంటి మర్యాదగా మాట్లాడే వాళ్లను వదిలిపెట్టి రెచ్చిపోయే మిగతా వాళ్లను నిల్చొబెట్టి తోలు వలుస్తానని హెచ్చరించారు పవన్ కల్యాణ్.

    English summary
    Janasena Party President Pawan Kalyan Strong Warning To YCP Leaders Over Calling Him Package Star At AP Mangalagiri Janasena Party Meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X