పవన్ కళ్యాణ్‌కు మళ్లీ నొప్పి మొదలైంది?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వెన్ను నొప్పి సమస్య చాలా కాలంగా బాధిస్తున్నసంగతి తెలిసిందే. ఉపశమనం కోసం మధ్య మధ్యలో చికిత్స తీసుకుంటున్పటికీ అది మళ్లీ మళ్లీ తిరగ బెడుతూనే ఉంది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' షూటింగులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పి చికిత్స నిమిత్తం బెంగుళూరులో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానుల్లో కంగారు మొదలైందని టాక్. పవన్ కళ్యాణ్ త్వరగా కోలు కోవాలని పలువురు ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గోపాలా గోపాలా' సినిమా విషయానికొస్తే...
హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెలుగులో 'గోపాలా గోపాలా'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తున్నాడు.
కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











