అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. సమస్య తీవ్రతరం.. మెగా అభిమానుల్లో ఆందోళన!

Recommended Video

Pawan Kalyan Suffering With Back Pain || మళ్లీ తిరగబెట్టిన సమస్య..!!

సినిమాల పరంగా పవర్ స్టార్, రాజకీయ పరంగా జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇన్నాళ్లు చురుకుగా ఉన్న పవన్.. గత రెండు రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో వేగం తగ్గించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడం, ఆయన అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో మెగా అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి పోతే..

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే

హీరోగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా చేశారు పవన్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్‌కి వెన్ను నొప్పి సమస్య మొదలైంది. అప్పటి నుంచే ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూ వస్తున్నారు పవన్. మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య తిరగబడటంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

స్వయంగా ఆయనే ప్రకటించడంతో..

స్వయంగా ఆయనే ప్రకటించడంతో..

విజయవాడలో జరగనున్న మీడియా సమావేశంలో పాల్గొనవల్సిందిగా జనసేన చీఫ్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని కోరారు. దీంతో దానికి స్పందించిన పవన్.. తన ఆరోగ్యం బాగా లేదని అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. ''గత కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నాను. అందువల్లనే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరఫున ప్రతినిధులు హాజరవుతారు'' అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు పవన్ కళ్యాణ్.

గత ఎన్నికల సమయంలోనూ ఇదే సమస్య

గత ఎన్నికల సమయంలోనూ ఇదే సమస్య

జనసేన పార్టీ స్థాపించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోను వెన్ను నొప్పి సమస్యతో బాధపడ్డారు పవన్. అప్పుడు కీలక సమయంలో విశ్రాంతి తీసుకోక తప్పలేదు. ఈ సమస్య పట్ల సర్జరీకి వెళ్లమని డాక్టర్లు సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం వైపు మొగ్గుచూపి ఆ దిశగా ముందుకు వెళుతున్నారట పవన్.

మెగా అభిమానుల్లో ఆందోళన

మెగా అభిమానుల్లో ఆందోళన

పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి సమస్య తీవ్రతరం అయిందని తెలియడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వెన్ను నొప్పి మాత్రం తీవ్రంగా మారడంతో ఆయన మరికొన్ని రోజుల పాటు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు కంగారు పడుతున్నాయి. తొందరలో ఆయన సమస్య నయం కావాలని కోరుకుంటున్నారు జనం.

సినిమాల్లోకి రీ ఎంట్రీ

సినిమాల్లోకి రీ ఎంట్రీ

జనసేన పార్టీ పెట్టాక సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్.. ఇక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీ పూర్తి బాధ్యతలు ఆయనపైనే ఉన్నాయి. అందులోనూ వెన్ను నొప్పి వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్ వెండితెర ప్రయాణం తిరిగి స్టార్ట్ చేస్తాడా? అనేది ప్రశ్నార్ధకమే మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X