వెన్ను నొప్పితో పవన్ : త్రివిక్రమ్ మూవీకి ఆటంకం!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రస్తుతం ఆయన వెన్ను నొప్పి(బ్యాక్ పెయిన్)తో బాధ పడుతున్నారని, ఈ కారణంగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కమిటైన సినిమాకు ఆటంకం కలుగుతోందని, ఈ కారణంగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
'గబ్బర్ సింగ్' సినిమా దగ్గర నుండే పవన్‌కి ఈ సమస్య మొదలైందిని, కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ సమయంలోనూ వెన్ను నొప్పి వేధించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెన్ను నొప్పి సమస్యలకు ఫారిన్ డాక్టర్ల పర్యవేక్షణలో శాశ్వత పరిష్కారం కోసం ట్రై చేస్తున్నాడని అంటున్నారు. అదే జరిగితే త్రివిక్రమ్‌తో చేసే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం 'సరదా' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈచిత్రం జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసారు. అయితే పవన్ వెన్ను నొప్పి నేపథ్యంలో డేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ పవన్ తాత్కాలిక ఉపశమనం పొంది షూటింగ్ కు రెడీ అయినా బాడీపై ఎక్కువ ఒత్తిడి పడని సీన్లు మాత్రమే షూట్ చేస్తారని అంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍గా చేస్తోంది. సెకండ్ హీరోయిన్ ను తీసుకునే యోచనలో కూడా ఉన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.


Click it and Unblock the Notifications











