గోపాల గోపాల.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్, అలాంటి పాత్రలు వస్తున్నాయి !

అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ వెండి తెరపై కనిపిస్తే చాలని భావించే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. ఆ మధ్యన తెలంగాణాలో పర్యటించిన నేపథ్యంలో ఇక సినిమాలు చేయడం లేదని పవన్ తెలిపిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని లీడర్ గా చూడాలని భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అయితే, వెండితెరపై పవన్ ని చూడాలనుకునే వారికి బ్యాడ్ న్యూసే. తాజగా పవన్ ఓ ఇంటర్వ్యూలో సినిమాలలో నటించే విషయం గురించి ఆసక్తికర నిర్ణయం ప్రకటించారు.

Recommended Video

'Bharath Ane Nenu' పవన్ కళ్యాణ్ అయితే ???
కోట్లాది రూపాయల ఆదాయం

కోట్లాది రూపాయల ఆదాయం

పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తే వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ పవన్ కు అందుతుంది. తన పొలిటికల్ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ సినిమాలని పక్క పెట్టేశాడు. పవన్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి.

సమయం దొరకడం లేదు

సమయం దొరకడం లేదు

ఓ ఆంగ్ల పత్రికతో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పలు విషయాలు వెల్లడించారు. ఇక సినిమాలు ఆపేసినట్లేనా అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సినిమాలు చేయడానికి నాకు సమయం దొరకడం లేదు. అందుకే దూరంగా ఉంటున్నా అని పవన్ తెలిపారు.

డబ్బు అవసరమైతే

డబ్బు అవసరమైతే

ప్రస్తుతానికైతే సినిమాలు చేసే ఉద్దేశం లేదని పవన్ అన్నారు. ఒకవేళ డబ్బు అవసరమైన పరిస్థితి ఏర్పడితే ఆలోచిస్తానని అన్నారు. అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ పవన్ పాలిటిక్స్ కోసం ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశారు.

అలాంటి పాత్రలు వస్తున్నాయి

అలాంటి పాత్రలు వస్తున్నాయి

ఇటీవల తనకు కామియో రోల్స్ వస్తున్నాయని పవన్ అన్నారు. వాటి గురించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానకి పవన్ తెలిపారు. ఆ పాత్రలని తాను ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ఇది కొంతవరకు పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పూర్తి స్థాయి పాత్రలు మాత్రం చేసే అవకాశం లేదని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X