twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ నగరంలో ‘పులి’ సంచారం!

    By Sindhu
    |

    పవన్ కళ్యాణ్ తర్వలో ట్రాఫిక్ పాఠాలు చెప్పబోతున్నాడట. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం పవన్ ని కోరడంతో, అందుకు సానుకూలంగా స్పందించిన పవన్, ట్రాఫిక్ పై ప్రజల్లో అవగాహన కోసం తనవంతుగా కృషి చేస్తానని హామి ఇచ్చాడట. డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయించుకునేందుకు హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ లో గల ఆర్డీఏ ఆఫీస్ కు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ని చూసేందుకు, అక్కడి సిబ్బంది, ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన వివిధ పనుల నిమిత్తం వచ్చిన జనం చుట్టుముట్టారు.

    స్టార్ హీరో అయినా బేషజాల్లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రావడాన్ని ఆర్టీఏ సిబ్బంది అభినందించారు. విభజన సెగల పుణ్యమా అని పవన్ కళ్యాణ్ సినిమాని బ్యాన్ చేస్తామనీ, చిరంజీవి కుటుంబ సభ్యుల్ని తెలంగాణలో తిరగనివ్వమనీ వేర్పాటువాదులు చెబుతోంటే, ఆర్టీఏ కార్యాలయంలో ప్రాంతాలకతీతంగా సిబ్బందీ, ఆర్టీఏ పనులకోసం అక్కడికి వచ్చిన జనం పవన్ ని చూసేందుకు ఎగబడ్డం విశేషం.

    గతంలో నాగార్జున కూడా ఇలానే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏను సందర్శించి, ట్రాఫిక్ పై అవగాహన కోసం తనవంతుగా కషి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. ఇలా సినిమా స్టార్ సెలబ్రిటీలతో ట్రాఫిక్ పాఠాలు చెప్పిస్తే, జనం తొందరగా అర్థం చేసుకుంటారని, యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గించవచ్చని ఆర్టీఏ విభాగం యోచిస్తోంది. కామన్ మ్యాన్ ప్రొటక్షన్ కోరుకునే పవన్ వారిని రక్షించడం కోసం ఎటువంటి పనిచేయడానికైనా సిద్దం అని చెప్పి అధికారులకు సంతోషాన్ని కలిగించాడట. ఈ మేరకు త్వరలోనే పవన్, నాగార్జున తదితరులతో ఓ అవగాహనా కార్యక్రమాన్ని రూపొందించడానికి ఆర్ఠీఏ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X