స్పీడ్ మీద ఉన్న పవన్ చూసి ఇక ‘తీన్ మారే’అంటూ కేరింతలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లవ్లీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'తీన్ మార్" వరుస పరాజయాల తర్వాత ఎంతో జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ పూర్తిగా మనసు పెట్టి నటించిన చిత్రం 'తీన్ మార్". టైటిల్ తోనే సగం విజయాన్ని ఖాయం చేసుకున్న ఈ చిత్ర సాంగ్స్ మార్చి 20న మార్కెట్ లోనికి విడుదల కానున్నాయని సమాచారం. అలాగే ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
ప్రస్తుతం యుఎస్ లో షూటింగ్ జరుపుకొంటున్నఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ని నిర్మాత గణేష్ బాబు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో సంచరిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ చిత్రం పూర్తయిన వెంటనే తమిళ డైరెక్టర్ విష్ణువర్థన్ తో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్ లో రానున్న 'షాడో" చిత్రం ఏప్రిల్ 15 నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తాజా సమాచారం. అంటే 'తీన్ మార్" విడుదల అయిన వారం రోజులకే పవన్ మరో చిత్రంతో బిజీ అవుతాడన్నమాట.ఇదే స్సీడ్ కొనసాగిస్తే ఇంక 'తీన్ మారే"అంటూ పవన్ అభిమానులు 'ఖుషీ" వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











