పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' ఆడియో రిలీజ్ విశేషాలు
పవన్ కళ్యాణ్, త్రిష హీరో హీరోయిన్ లుగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న 'తీన్ మార్' సినిమా పాటల విడుదల కార్యక్రమం ఈ సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక అభిమానుల ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది.తోలి సీడీని బొత్స ఝాన్సి విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. ఈ సందర్బంగా త్రిష మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. అందరినీ అలరించే చిత్రమిది. వంద రోజుల వేడుకలో తెలుగులో మాట్లాడతా'' అన్నారు. నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్ రుణం తీర్చుకోలేనిది. ఆయనతో సినిమా తీయడం ఆనందంగా ఉందని అన్నారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ...సుస్వాగతం సినిమా నుంచి గణేష్ నాకు బాగా తెలుసు. అందుకే ఈ సినిమా చేశాను. జయంత్‌తో కలిసి పని చేయాలని నేను పదేళ్లక్రితమే అనుకొన్నా. అది ఇప్పటికి కుదిరింది. 'లవ్ ఆజ్ కల్' బాగా నచ్చింది. త్రివిక్రమ్‌తో మాటలు రాయించి ఈ సినిమాను సిద్ధం చేశాం. మణిశర్మ చక్కటి సంగీతం అందించారు. ఖుషీ, గుడుంబా శంకర్ తరవాత తనతో నేను చేసిన చిత్రమిది. తప్పకుండా అభిమానులను మెప్పిస్తుందీ చిత్రం'' అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి వాద్యకచేరీ అలరించింది. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, అల్లు అరవింద్, నాగబాబు, మణిశర్మ, అలీ, జయనన్ విన్సెంట్, భాస్కరభట్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











