twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్చి చివరి వారంలో పవన్ కళ్యాణ్ తీన్ మార్ హల్ ఛల్...

    By Sindhu
    |

    పవన్ కల్యాణ్ హీరోగా హాస్యనటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న 'తీన్ మార్' సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను కర్నాటకలోని మైసూర్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. వారం రోజులపాటు జరిగిన ఈ షూటింగులో పవన్ కల్యాణ్, త్రిష, ఆలీ లతో బాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొన్నారు. మైసూరు, పాండవపుర, శ్రీరంగపట్నం, మేల్కొటే పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిఅయింది.

    జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మరో పక్క ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఏక కాలంలో హైదరాబాదులో జరుగుతోంది. మార్చి మొదటి వారంలో ఆడియోను, ఆ నెలాఖరుకి సినిమాను రిలీజ్ చేసే పనిలో యూనిట్ వుంది. హిందీ సినిమా 'లవ్ ఆజ్ కల్' ఆధారంగా జయంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    పవర్‌ స్టార్ కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ లో రూపొందుతున్న చిత్రమిది. త్రివిక్రమ్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తాయి. త్వరలోనే ఫారిన్‌ లో ఓ షెడ్యూల్ చేయనున్నాం. అందులో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెల చివరి వరకు ఆ షెడ్యూల్ జరుగుతుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మార్చి మొదటివారంలో పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సమ్మర్‌ లో మా 'తీన్‌ మార్" బాక్సాఫీస్ వద్ద హల్‌ చల్ సృష్టించడం ఖాయం" అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాత గణేష్ బాబు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X