పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’బ్లాస్ట్ అయితే ‘ఖుషి’ లేకపోతే ‘పోకిరి’యే..!
పవన్ కళ్యాణ్ 'తీన్ మార్" సందడి మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. మార్చి 21న పాటల విడుదల నుంచి ప్రోమోస్, పబ్లిసిటీ అన్నీ మొదలవుతాయి. ఇదిలావుంటే ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా కచ్చితమైన సమాచారం అందలేదు. మొదట్లో ఏప్రిల్ 14న విడుదల అవుతుందని అనుకున్నా కానీ ఆలస్యం జరగవచ్చనేది లేటెస్ట్ న్యూస్.
ఏప్రిల్ 27న లేదా 28న 'తీన్ మార్" రిలీజ్ అయ్యే అవకాశముందని సమాచారం. ఈ రెండు డేట్స్ లో ఏది ఫిక్సయినా కానీ సెంటిమెంట్ గా పవన్ ఫ్యాన్స్ జల్సా చేసేసుకుంటారు. ఎందుకంటే ఏప్రిల్ 27న పవన్ ఖుషీ రిలీజ్ కాగా, 28న మహేష్ పోకిరి రిలీజయింది. 'ఖుషీ" అప్పటికి తెలుగు చిత్ర పరిశ్ర చూడని అరుదైన రికార్డులని నెలకొల్పగా, 'పోకిరి" అంతవరకు ఉన్న కమర్షియల్ రికార్డులన్నిటినీ తుడిచి పెట్టేంది. ఏ డేట్ ఫిక్సయినా కానీ సెంటిమెంట్ పరంగా 'తీన్ మార్" కి మంచి ముహోర్తం సెట్ అయినట్టే. చూద్దాం, ఫైనల్ గా పవన్ తీన్ మార్ ఆడించే డేటేంటో, ఈ సినిమా ఫేటెంటో..?


Click it and Unblock the Notifications











