విక్టరీ ఎవరిది..పవన్ కళ్యాణా...జూ ఎన్టీఆరా...!?
గత దసరా సీజన్ లో జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పోటీ పడగా, విజయం ఎన్టీఆర్ నే వరించింది. పవన్ నటించిన 'కొమరం పులి" అట్టర్ ప్లాప్ అయి, ఎన్టీఆర్ 'బృందావనం"కమర్షియల్ గా మంచి హిట్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగుతోన్న ఈ ఇద్దరు హీరోల పోటీ ఆసక్తికరంగా మారింది. ఈసారైనా పవన్ కళ్యాణ్ పైచేయి సాధిస్తాడో లేదోనని మెగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తీన్ మార్" చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుండగా, జూ ఎన్టీఆర్ 'శక్తి" ని చూపించడానికి మార్చి 31న ముహూర్తం నిర్ణయించుకున్నాడు. కేవలం రెండు వారాల వ్యవధిలో వస్తోన్న ఈ రెండు చిత్రాలపై బిజినెస్ వర్గాల్లో అమితాసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కి ఎన్ని ప్లాప్ లు తర్వాతైన క్రేజ్ కి ఢోకా లేదు కాబట్టి 'తీన్ మార్"కూడా సిమిలర్ క్రేజ్ దక్కించుకుంది. ఇక వరుసగా డీసెంట్ హిట్స్ తో దూసుకెళుతున్న జూ ఎన్టీఆర్ 'శక్తి"కి మగధీర స్థాయి చిత్రమవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి మెగా వర్సెస్ నందమూరి వార్ లో ఎవరిని విక్టరీ వరిస్తుందో, ఎవరి ఫ్యాన్స్ కి మిస్టరీ మిగుతలుతుందో ఆసక్తి రేకెత్తిస్తోంది..


Click it and Unblock the Notifications











