పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తెలియగానే అభిమానులు, సినీ తారలకు, రాజకీయ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు ద్వారా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో కరోనావైరస్, అలాగే పవన్ కల్యాణ్ గురించి రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఆసక్తిగా మారాయి. ఆ ట్వీట్లు ఏమిటంటే..

కుంభమేళాపై విరుచుకుపడ్డ ఆర్జీవి
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రెండు రోజులుగా కరోనావైరస్ గురించి ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించిన కుంభమేళా కరోనావైరస్ వ్యాప్తిగా ప్రధాన సాధనంగా మారింది అంటూ ట్వీట్ చేశారు. గతేడాది జమాతే సమ్మేళనం.. ఈ ఏడాది కుంభమేళ కరోనా వ్యాప్తికి కారణం అంటూ పేర్కొన్నారు.

కుంభమేళా హారర్ మూవీ.. భక్తులు విలన్
కుంభమేళా మీద హారర్ సినిమా తీస్తారా అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవి మరో సైటెర్ వేశాడు. కుంభమేళా హారర్ ఫిలిం అయితే కోవిడ్ హీరో అంటూ కామెంట్ చేశాడు. ఇక కరోనాను వ్యాప్తి చేసి భక్తులు విలన్‌గా మారారు అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

సామూహిక ఆత్మహత్యలా?
కుంభమేళా తర్వాత భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఈ పరిస్థితి చూస్తుంటే భారత్ సామూహిక సూసైడ్ మిషన్‌కు దారి తీస్తుందా అనే అనుమానం కలుగుతున్నది అంటూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు.

రాజకీయ నేతలపై సెటైర్స్
దేశంలో నిర్వహిస్తున్న కుంభమేళా, రాజకీయ ర్యాలీలను చూస్తే రాజకీయ నేతలు ఓట్ల కోసమే శ్రమిస్తున్నారు. ప్రజల క్షేమం ఏమాత్రం పట్టదనే విషయం స్పష్టమైంది. ప్రజలు ఓట్లేసిన తర్వాత వాళ్లు చచ్చిన వారు పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఎంత తెలివైన వారు మీరే చెప్పండి అంటూ వర్మ కామెంట్ చేశారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు చురక
ఇక పవన్ కల్యాణ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన తర్వాత ఆయన క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆ ఫోటోను ఉద్దేశించి వర్మ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆ వైరస్ ముండలని పచ్చడి చేసి చంపేయండి అంటూ వర్మ తనదైన శైలిలో పోస్టు పెట్టారు.
Recommended Video

హీరో ఉన్నట్టా లేనట్టా..
పవన్ కల్యాణ్ గురించి మరో ట్వీట్ వర్మ చేస్తూ.. ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి యువర్ హానర్ అంటూ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











