పవన్ కల్యాణ్‌కు కరోనా టెస్టులు: బయటకు వచ్చిన ఫొటోలు.. రిపోర్టు ఎలా వచ్చిందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడతను. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కోసం గ్యాప్ తీసుకుని, మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక, ఈ మధ్య ఈ మూవీ యూనిట్‌లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పవన్.. తాజాగా కోవిడ్ టెస్టులు చేయించుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు

మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్

మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్

రాజకీయల కోసం మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. గత వారమే 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది.

అన్ని చోట్లా అదుర్స్.. కలెక్షన్లు భారీగా

అన్ని చోట్లా అదుర్స్.. కలెక్షన్లు భారీగా

'వకీల్ సాబ్'కు అన్ని ప్రాంతాల నుంచి విశేషమైన స్పందన లభించింది. దీంతో ప్రీమియర్స్ నుంచే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఫలితంగా టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను 'వకీల్ సాబ్' మూవీ బద్దలు కొట్టేస్తోంది. అదే సమయంలో వంద కోట్ల మార్కును చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

‘వకీల్ సాబ్' యూనిట్‌కు కరోనా టెన్షన్

‘వకీల్ సాబ్' యూనిట్‌కు కరోనా టెన్షన్

'వకీల్ సాబ్' మూవీ యూనిట్‌కు కరోనా వైరస్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే చిత్ర హీరోయిన్ నివేదా థామస్ ఈ మహమ్మారి బారిన పడింది. ఆ తర్వాత మరికొందరికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచేలా మాట్లాడిన బండ్ల గణేష్ రెండోసారి ఈ వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే.

హోమ్ క్వారంటైన్‌లో పవన్... ప్రకటన

హోమ్ క్వారంటైన్‌లో పవన్... ప్రకటన

'వకీల్ సాబ్' మూవీ యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో పవన్ కల్యాణ్ వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని కూడా అందులో చెప్పుకొచ్చారు.

సీక్రెట్‌గా పవన్ కల్యాణ్‌కు కరోనా టెస్ట్

సీక్రెట్‌గా పవన్ కల్యాణ్‌కు కరోనా టెస్ట్

తన చుట్టూ ఉన్న పలువురు కరోనా బారిన పడడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉంటోన్న పవన్ కల్యాణ్.. తాజాగా కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన ఈ పరీక్షలు చేయించుకున్నారు. పవర్ స్టార్‌తో పాటు యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ కూడా ఆస్పత్రికి వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

పవర్ స్టార్‌కు రిపోర్టు ఎలా వచ్చిందంటే

పవర్ స్టార్‌కు రిపోర్టు ఎలా వచ్చిందంటే

'వకీల్ సాబ్' మూవీకి సంబంధించిన వారితో పాటు చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో పవన్ కల్యాణ్ గురించి ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిపిన కోవిడ్ టెస్టుల్లో పవర్ స్టార్‌కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన అభిమానులతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X