twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ మానవత్వం మాటలకు అందనిది.. అల్లు అర్జున్, దిల్‌ రాజు, ‘మైత్రీ’ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు!

    |

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సంబరాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కడపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన జనసైనికుల కుటుంబాలకు సంతాపంతోపాటు సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన జన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి సినీ ప్రముఖులు, ఎన్నారైలు అందించిన సహాయం వివరాలను వెల్లడిస్తూ...

    జనసేన నేతల పరామర్శ, ఆర్థిక సహాయం

    జనసేన నేతల పరామర్శ, ఆర్థిక సహాయం

    కడపల్లి వద్ద జరిగిన దుర్ఘటనలో మరణించిన, గాయపడిన జనసైనికులు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయలసీమ ప్రాంత సంయుక్త సమన్వయ కమిటీ సభ్యుడు చింతా సురేష్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, కుప్పం ఇంఛార్జ్ డాక్టర్ ఎమ్.వెంకటరమణ, గంగాధర నెల్లూరు ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ వెళ్లారు. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

    అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు

    అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు

    కడపల్లి దుర్ఘటన బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన అల్లు అర్జు‌న్‌కు కృతజ్ఞతలు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలుగా మొత్త 6 లక్షల రూపాయలు అందించారు. అలాగే జనసేన ఎన్నారై మద్దతుదారులు రూ.5.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వారికి నా ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

    దిల్ రాజు, ఏఎం రత్నంకు ప్రశంసలు

    దిల్ రాజు, ఏఎం రత్నంకు ప్రశంసలు

    చిత్తూరు దుర్ఘటనలో మరణించిన జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన నిర్మాత దిల్ రాజుకు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే నిర్మాత ఏఎం రత్నంకు నా కృతజ్ఞతలు. ప్రతీ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 6 లక్షలు ఇవ్వడానికి ముందుకు గొప్ప హృదయాన్ని చాటుకొన్నారు. ఇలాంటి విషాద సమయంలో మీరు చూపించిన మానవత్వం గురించి మాటల్లో చెప్పలేం అంటూ పవన్ కల్యాణ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    మైత్రీ మూవీస్‌కు ధన్యవాదాలు

    మైత్రీ మూవీస్‌కు ధన్యవాదాలు


    కడపల్లి దుర్ఘటన బాధితుల ఫ్యామిలీలకు అండగా నిలిచిన మైత్రీ మూవీస్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతీ కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిన మైత్రీ మూవీస్ అధినేతలు రవి, నవీన్‌కు కృతజ్ఞతలు. మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చూపిన బాధిత కుటుంబాలకు అందించిన సహకారం గొప్పది అంటూ పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు.

    English summary
    Pawan Kalyan shows gratitude who helps family members of deceased in Chittoor tragic accident. Pawan tweeted that, My heartfelt thanks Folded hands to Sri alluarjun, Sri Dil Raju garu’ SVC_official, Sri Ravi garu & Sri Naveen garu for standing by the families of deceased, by giving 6 lakhs( 2lakhs to each). My Good wishes to you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X