'ఆర్కూట్' లో టాప్ డిబేట్ తెలుగు స్టార్ ఆ హీరో మాత్రమే...
గూగుల్ ఇండియా ప్రొడక్టు మేనేజర్ రాహుల్ కులకర్ణి భారతదేశంలో ఆర్కూట్ ఎదుగుదల,విస్తరణ గురించి వివరిస్తూ తాజాగా ఓ ప్రకటన చేసారు. అందులో టాప్ టెన్ నేషనల్ కమ్యూనిటీస్ లో ఏ విభాగాలకు ప్రయారిటీ దొరికి పాపులర్ అవుతున్నాయో వివరిస్తూ..నేషనల్ లెవిల్ లో సౌత్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా పాపులర్, చాలా కమ్యునిటీస్ లో అతని సినిమాల గురించి డిబేటింగ్ లు, అతని లుక్స్, లైఫ్ స్టైల్ గురించి చర్చలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి అన్నారు. అలాగే ఇండియా గురించి,స్టైలిష్ పీపుల్,బోయ్స్ వెర్సస్ గర్ల్స్, తమిళ్ సినిమా, తెలుగు మూవి వరల్డ్,ప్రెండ్స్,ఐ లవ్ మై స్కూల్ ప్రెండ్స్, టామ్ అండ్ జెర్రీ కూడా ఈ టాప్ టెన్ నేషనల్ కమ్యూనిటీస్ లో చోటు చేసుకున్నాయని తెలియచేసారు. అలాగే మోస్ట్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్స్ కమ్యూనిటీ లో షాహిద్ కపూర్,సల్మాన్ ఖాన్ ఫ్యాన్ క్లబ్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక మోస్ట్ ఫేమస్ ప్రమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎఆర్ రహమాన్ ప్యాన్స్, మైకల్ జాక్సన్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











