twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధ్వంసం చేసి ఏం సాధిస్తాం.. కాపాడుకొందాం, కదలిరండి.. పవన్, కౌశల్, అనసూయ పిలుపు

    |

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకొంటున్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ ఇ్పటికే స్పందించారు. తాజాగా విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, అనసూయ, బిగ్‌బాస్ విజేత కౌశల్ మండా స్పందించారు.

     బంగారు తెలంగాణానా? కాలుష్య తెలంగాణనా?

    బంగారు తెలంగాణానా? కాలుష్య తెలంగాణనా?

    భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి? అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. భూమి మనుషుల సొత్తు కాదు అటూ అమెరికాలో ఆదివాసీలకు సంబంధించిన భూమి సమస్య గురించి యూఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

    భూమిని తవ్వడం అంటే

    భూమిని తవ్వడం అంటే

    అర్జున్ రెడ్డి చిత్రంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న రాహుల్ రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మైనింగ్ అనేది కేవలం భూమిని తవ్వడం అనుకొంటే పొరపాటే.. మైనింగ్ వల్ల అమూల్యమైన సహజ వనరులు, పర్యావరణం, అరుదైన జీవ సంపద నాశనం అవుతుంది. అలాగే వేలాది ఆదివాసీయులు నిరాశ్రయులవుతారు. వేల ఎకరాల అడవులు కాలగర్భంలో కలిసిపోతాయి అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశాయి.

     మనల్ని మనమే ధ్వంసం

    మనల్ని మనమే ధ్వంసం

    నల్లమలలో యురేనియం తవ్వకాలపై బిగ్‌బాస్ విజేత, నటుడు కౌశల్ మందా స్పందించాడు. నల్లమల అడవులను నాశనం చేస్తే మనం మనల్నే ధ్వంసం చేసుకొన్నవాళ్లమవుతాం. భావితరాలు స్వచ్ఛమైన వాయువులను పీల్చడానికి, పర్యావరణ ముప్పు రాకుండా ఉండటానికి నల్లమల్ల అడవులను కాపాడుకోవాలి అని కౌశల్ తెలిపారు.

    పిటిషన్‌పై సంతకాలు

    పిటిషన్‌పై సంతకాలు

    పర్యావరణానికి ముప్పు వాటిల్లే తవ్వకాలపై నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేయాలి. మనమంతా సంతకాలు చేసి నల్లమల అడవులను కాపాడుకొందాం అని అనసూయ ట్వీట్ చేశారు.

    విజయ్ దేవరకొండ ఆందోళన

    విజయ్ దేవరకొండ ఆందోళన

    ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి కి వచ్చాము. గాలి , నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీ ని వినియోగం లోకి తెద్దాం...ప్రతి పై కప్పు పై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం.. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీ తో ఏమి చేయాలి...? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం. నల్లమలను కాపాడుకుందాం... మనకోసం, మన భవిష్యత్ కోసం అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

    English summary
    Tollywood is raising voice for the support of Save Nallamalla. Rahul Ramakrishna tweeted that.. In order to #SaveNallamalla, which I find is a very elite, privileged campaign that barely skims the surface of the problems plaguing the Nallamalla and its inhabitants, one must also demand the complete implementation of constitutional rights and acts bestowed upon the adivasis
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X