Ante Sundariniki Pre release event నాని కోసం పవన్ కల్యాణ్.. ఒకరోజు వెనక్కి ఈవెంట్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన హీరో నాని నేచురల్ స్టార్ నాని అని అనిపించుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. మినిమమ్ గ్యారంటీ మార్కెట్ ఉన్న హీరోగా నానికి తెలుగులో మంచి పేరుంది. తాజాగా ఆయన అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. జూన్ పదో తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే

సర్వం సిద్ధమై

సర్వం సిద్ధమై

చివరిగా శ్యాం సింగారాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకుడు వివేక్ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమా చేశారు. మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా బాగుండంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వేడుకకు పవర్ స్టార్

వేడుకకు పవర్ స్టార్

ఈ సినిమా జూన్ పదో తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో తొలుత జూన్ ఎనిమిదో తేదీ సాయంత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ శిల్పకళావేదికలో సాయంత్రం ఆరు గంటల నుంచి సినిమా యూనిట్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత నుంచి ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది.

9 వ తేదీ

9 వ తేదీ

అయితే ప్రచారం అయితే జరిగింది కానీ ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తాజాగా నాని ఈ విషయం మీద స్పందించారు. సుందర్ కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నారని పేర్కొన్నారు. తొలుత ఎనిమిదో తేదీ సాయంత్రం ఈ వేడుక నిర్వహించాలని అనుకున్నాము కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక రోజు వెనుకకు వాయిదా వేసి 9 వ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుతున్నామని నాని ప్రకటించారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో

హరీష్ శంకర్ దర్శకత్వంలో

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆధ్వర్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ వేడుకకు హాజరు కావలసిందిగా కోరగా దానికి ఒప్పుకున్న ఆయన వేడుకకు హాజరు అవుతున్నట్లు సమాచారం.

మొత్తం మూడు బాషలలో

మొత్తం మూడు బాషలలో

ఇక ఈ సినిమాలో నాని నజ్రియా నజీమ్ కీలక పాత్రలో నటిస్తుండగా నటుడు హర్షవర్ధన్, తమిళ నటుడు అళగం పెరుమాళ్, నిక్కీ తంబోలి, రోహిణి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నజ్రియా నజీమ్ కూడా ఉండడంతో ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళ, మలయాళ బాషలలో కూడా విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X