Balakrishna 50 Years: బాలయ్య కోసం ఇండస్ట్రీ.. కనీవినీ ఎరుగని రీతిలో స్వర్ణోత్సవ ఈవెంట్!
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ అరుదైన మైలురాయిని అధిగమించారు. 100 ఏళ్ల సినిమా చరిత్రలో బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఘనత తెలుగు సినీ అభిమానులకు ఆనందం కలిగించే విషయంగా మారింది. అయితే బాక్సాఫీస్ బొనాంజాగా పేరు ఉన్న ఆయనకు తెలుగు సినిమా ఘనంగా సత్కరించాలని నిర్ణయించింది. బాలయ్య గొల్గెన్ జూబ్లీ ఈవెంట్‌ను సెప్టెంబర్ 1వ తేదీన భారీగా ప్లాన్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణ స్వర్ణోత్సవ ఉత్సవాలకు భారీగా ఎర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఈవెంట్‌ను హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణాదిలోని ప్రముఖ నటీనటులు, అలాగే బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లకు ఆహ్వానాలు స్వయంగా అందజేశారు. దాంతో ఈ వేడుకకు భారీగా జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు.
ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇన్విటేషన్స్ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో అందరికీ పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబ అని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్మానం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కల్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇక కనీవినీ ఎరుగని రీతిలో ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న సిని పరిశ్రమ పెద్దలు.. రాజకీయ నేతలను కూడా ఆహ్వానించారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంకా వ్యాపార, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వనించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగా హీరోలందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. స్వయంగా కలిసి ఈవెంట్‌కు హాజరు కావాలని రిక్వెస్ట్ చేశారు. దాంతో మెగా హీరోలందరూ హాజరయ్యే అవకాశం ఉంది అని సినీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఏపీలో బిజీ బిజీగా అనేక కార్యక్రమాలతో మునిగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌కు చేరుకొంటారు. అనంతరం ఆయన బాలయ్య సర్ణోత్సవ ఈవెంట్‌లో పాల్గొని.. ప్రసంగిస్తారు అని టాలీవుడ్ ప్రముఖులు తెలిపారు. దాంతో ఈవెంట్‌కు ఆయన ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు.
ఇక బాలయ్య 50 ఏళ్ల ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. అలాగే నందమూరి కుటుంబంలోని ప్రముఖులను కూడా వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు. దాంతో ఈ వేడుక కన్నుల పండువగా జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











