వచ్చే ఏడాది ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ "సత్యాగ్రహి" చిత్రానికి ఆయనే దర్శకుడు . 'జాని' తర్వాత అతను డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. ఇంతకీ ఈ సినిమా మరేదో కాదు. అప్పట్లో శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే అనంతర కాలంలో రత్నం నిండా నష్టాల్లో కూరుకు పోవడంతో ఆయన 'సత్యాగ్రహి'ని నిర్మంచలేనని పవన్‌కు చెప్పేశారు. రెండేళ్ల తర్వాత ఆ సినిమాను నిర్మించే వ్యక్తి నూకారపు రూపంలో పవన్‌కు లభించాడు. 'సత్యాగ్రహి'ని పవన్ దర్శకత్వంలోనే నిర్మించేందుకు నూకారపు అంగీకరించారు. ఒకవైపు 'పులి' కోసం సిద్ధమవుతూనే, మరోవైపు 'సత్యాగ్రహి' స్క్రిప్టును తన రచయితల బృందంతో కలిసి తయారు చేస్తున్నారు పవన్. ఇప్పటికే ఆ స్క్రిప్ట్ 75 శాతం దాకా పూర్తయిందని సమాచారం. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరాని అమితంగా ఆరాధించే పవన్, ఆయన స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నాడు.