జయమ్మ కోసం పవర్‌స్టార్.. యాంకర్ సుమకు అండగా పవన్ కల్యాణ్
యాంకర్ సుమ చాలా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమా ఈవెంట్లు మరోపక్క టీవీ షోలతో ఆమె రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఆమె సినిమాల్లో కనిపించడం చాల తక్కువ అనే చెప్పాలి. ఆమె తాజాగా లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు జయమ్మ పంచాయతీ కాగా ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విషయంలో సుమకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఆ వివరాలు

జయమ్మ పంచాయతీ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయతీ'. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ఒక వీడియో విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఒక పల్లెటూరి డ్రామా అని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎవరికీ, దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ నటించారని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ లాంచ్
గతంలో రామ్‌చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను పదహారో తారీఖున ఉదయం 11 గంటల ఆరు నిముషాలకు పవన్ కళ్యాణ్ లాంచ్ చేయనున్నారు.

50 లక్షల రెమ్యునరేషన్
ఇక ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి అందించగా కెమెరా వర్క్ అనూష్ కుమార్ చూస్తుకున్నారు. ఇక విజయలక్ష్మి సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమాకు అమర్-అఖిల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవరించారు. ఈ సినిమా సుమ కోసం దాదాపు 50 లక్షల వరకు ఛార్జ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా సై అనేశారని అంటున్నారు.

ఫ్యాన్ ఫాలోయింగ్
ఎందుకంటే సుమ ఉంటే కచ్చితంగా థియేటర్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. టీవీలో అయినా వర్కవుట్ అయిపోతుందని అందుకే పెట్టిన అక్కడే బడ్జెట్ అంతా రికవర్ అవుతుందనే ధైర్యంతో ఆమె మీద అంత పెట్టుబడి పెట్టినట్టు చెబుతున్నారు. ఎందుకంటే టెలివిజన్‌లో సుమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 22న విడుదల చేయాలని అనుకున్నారు.

వాయిదా
కానీ కేజీఎఫ్ 2 సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న క్రమంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మే నెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కేజేఎఫ్ 2 హవా ఏప్రిల్ 29 దాకా ఉంటుందని అప్పుడు ఆచార్య హవా మొదలవుతుందని అంటున్నారు. అందుకే నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











