twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్జరీకి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ దానికి శాశ్వత పరిష్కారంలో భాగంగా సర్జరీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నిపుణులను సంప్రదించిన అనంతరం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కనీసం మూడు నుంచి నాలుగు వారాలు విశ్రాంతి అవసరం కావడంతో...‘గోపాలా గోపాలా' చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకుంటారని తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా' చిత్రం విశేషాల్లోకి వెళితే....కిషోర్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ముఖ్య భూమిక పోషిస్తోంది. శరత్‌మరార్‌, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

    దర్శకుడు కిషోర్‌ పార్థసాని(డాలీ) మాట్లాడుతూ... " అప్పుడప్పుడు మాటల సందర్భంలో 'మీకు సమాధానం చెప్పాలంటే ఆ దేవుడే దిగిరావాలి బాబూ...' అంటుంటాం సరదాగా! అయితే నిజంగానే ఒక భక్తుడి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఆ దేవుడు దిగొచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణావతారంలో. మరి కళ్లముందు కనిపించిన ఆ దేవుడితో భక్తుడు ఏం మాట్లాడాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే" అన్నారు.

    Pawan Kalyan to undergo a corrective surgery

    నిర్మాతలు మాట్లాడుతూ.. ''దేవుడినే సవాల్‌ చేసిన ఓ భక్తుడి కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి పంచే వినోదాలు అందరికీ నచ్చుతాయి''అని చెప్తున్నారు.

    సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీక్షాపంథ్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ చిత్రం ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.

    ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: శరత్‌మరార్‌, సురేష్‌బాబు.

    English summary
    Actor Pawan Kalyan to undergo a corrective surgery for his chronic back pain , which he has been suffering from last two years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X