వరాహి వాహనంతో కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆంజనేయస్వామి ఆశీస్సులతో 24న సమరభేరి

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గతంలో కొండగట్టులోని ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఏపీలో రాజకీయ పర్యటన, బస్సు యాత్ర చేపట్టునున్న నేపథ్యంలో మరోసారి ఆంజనేయస్వామిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. పవన్ కల్యాణ్ జనవరి 24వ తేదీ పర్యటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2009లో ప్రమాదం నుంచి బయటపడి..

2009లో ప్రమాదం నుంచి బయటపడి..

2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున యువరాజ్యం నేతగా కరీంనగర్ జిల్లా, తెలంగాణ ప్రాంతంలో పర్యటించి పార్టీకి ప్రచారం చేశారు. ఆ సందర్భంగా బస్సుపై ప్రయాణిస్తున్న ఆయనకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యారు. అయితే తాను ప్రమాదం నుంచి బయటపడటానికి ప్రధాన కారణం ఆంజనేయస్వామి కటాక్షమే అని భావిస్తూ వస్తున్నారు.

కొండగట్టు నుంచి కార్యక్రమాలు

కొండగట్టు నుంచి కార్యక్రమాలు


పవన్ కల్యాణ్ అప్పటి నుంచి తాను ఏదైనా కీలకమైన కార్యక్రమాన్ని తలపెట్టే ముందు కొండగట్టు ఆలయాన్ని దర్శించుకొంటారు. ఏపీలో త్వరలో రాజకీయ యాత్ర కోసం సిద్ధం చేసిన వరాహి వాహనానికి కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 24వ తేదీన కొండగట్టు, ధర్మపురి ప్రాంతాలను దర్శించుకొంటారు.

వరాహి వాహనానికి కొండగట్టులో పూజలు

వరాహి వాహనానికి కొండగట్టులో పూజలు


ఏపీలో బస్సు యాత్రకు సిద్దం చేసిన వరాహి వాహనాన్ని కొండగట్టు నుంచే ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు. కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తెలంగాణ నేతలతో ఆయన సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన కార్యక్రమాలు, పార్టీ అనుసరించే వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

ధర్మపురిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

ధర్మపురిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు


అలాగే జనవరి 24వ తేదీన అనుష్టుమ్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)ను ప్రారంభిస్తారు. ధర్మపురిలోని నరసింహస్వామి దేవాలయాన్ని సందర్భించి ఈ యాత్రకు శ్రీకారం చుడుతారు. ఆ క్రమంలో మరో 31 నారసింహ స్వామి ఆలయాలను సందర్శిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X