తేలేది నేడే: పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఉత్కంఠ!
హైదరాబాద్: మురుగదాస్ సినిమాలంటే సౌతిండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు సందేశాత్మంగా, వినోదాత్మకంగా ఉంటాయి. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘కత్తి' తమిళనాడులో విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది.
ఈ చిత్రం సందేశాత్మకంగా ఉండటంతో తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆసక్తిని గమనించిన నిర్మాత ఠాగూర్ మధు ఈ విషయాన్ని పవర్ స్టార్ దృష్టికి తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ సినిమా చూసి తన నిర్ణయం చెబుతానని చెప్పడంతో ఈ రోజు (అక్టోబర్ 28) స్పెషల్ షో ఏర్పాటు చేసారు. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయం చెప్పనున్నారు. పవన్ ఏ నిర్ణయం చెబుతారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

విజయ్ నటించిన 'కత్తి' చిత్రం ఒకే రోజున రూ.15.50 కోట్లు వసూలు చేసి రికార్డుకెక్కింది. తమిళ సినీ పరిశ్రమలో ఇదో రికార్డు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మొదట్లో ఈ చిత్రం విడుదలకు కొన్ని తమిళ సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. చిత్రం విడుదలను అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రకటించారు. చివరికి నిరసన కారులతో చిత్ర బృందం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది.
గతంలో విజయ్ హీరోగా చేసిన ‘ఖుషీ' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.


Click it and Unblock the Notifications











