సినిమాలు వదిలేస్తా: పవన్

By Staff

మీ కోసం అవసరమైతే సినిమాలు కూడా వదిలేసుకుంటానని ప్రజలనుద్దేశించి..ప్రకటించారు యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్. హన్మకొండలో ప్రజారాజ్యం, నవతెలంగాణ పార్టీలు సంయుక్తంగా జరిపిన సామాజిక తెలంగాణ ఆత్మగౌరవ సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు.ఆ సభలో పవన్‌ ఆవేశంగా ..కాంగ్రేస్ ను ఉద్దేశించి..వోయ్‌! మీరు(పాలకులు) దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకునే వాళ్లం కాదు. నాకు చావంటే భయం లేదు. హైటెన్షన్‌ వైర్లే నన్నేమీ చేయలేదు. మీరేం చేస్తారు' అంటూ చొక్కా గుండీలు విప్పదీశారు. అలాగే అవసరమైతే సినిమాలు సైతం వదలేసుకుంటానన్నారు.

'వారు డబ్బులు దొబ్బీ దొబ్బీ ప్రజాసేవను మరిచారు. దోచుకోవడానికి అలవాటు పడిన వీరికి తోలు బాగా మందమైంది. జనం జీవితాలతో ఆటలాడుకుంటున్నారు' అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అవన్నీ ఎలా ఉన్నా పవన్ సినిమాలు మానేస్తానని అనటం అతని అభిమానులను తీవ్రంగా భాధకు గురిచేస్తోంది. మాట వరసకు అలా అన్నా అటువంటి నిర్ణయం తీసుకోవటం అనవసరం అంటున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ..నటించిన పులి చిత్రం రిలీజ్ కానుంది. అలాగే పూరి జగన్నాధ్ డైరక్షన్ లో రెడీ కాబోయే చిత్రం కూడా మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X