స్పెయిన్ పర్యటనలో పవన్..ఎందుకంటే
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఆయన, దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ఆ దేశం వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఇందులో ఎక్కువ భాగం చిత్రీకరణ స్పెయిన్‌లోనే సాగుతుంది. అక్కడ దాదాపు 30 -45 రోజులపాటు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే హీరో, దర్శకుడు కలిసి లొకేషన్ల వేటలో ఉన్నారు. పవన్ ఇలా లొకేషన్స్ సెర్చ్ చేయటానికి వెళ్లటం తొలిసారి.
డిసెంబర్ చివరి వారంలో వెనక్కి తిరిగి వస్తారు. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సంగీతానికి ప్రత్యేక స్ధానం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై పవన్ ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారు. అందుకే ఆయనే స్వయంగా లొకేషన్స్ ఎంపికకు బయిలుదేరారు.
ఇర ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్ల జల్లు కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.
ఈ తాజా చిత్రంలో పవన్ కళ్యాణ్ ..అర్బన్ యూత్ ని రిప్రజెంట్ చేసే పాత్రను చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకమైన కసరత్తు నిర్మాత,హీరో చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా సినిమాలో కనపడే లుక్ కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసి చూసుకున్నారని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం నడిచినా పాత్ర మాత్రం ఈ జనరేషన్ యూత్ ని గుర్తు చేసేలా ఉండాలని పవన్ ప్రత్యేకంగా చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. గెడ్డంతో కనపడితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి పాత్ర గుర్తుకు వస్తుందంటున్నారు. పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ నవంబర్ 23 ఫిల్మ్ నగర్లో జరిగింది.
ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











