మళ్ళీ 'పంజా'లో పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ మేనరిజమ్ ..!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టంట్స్ చాలా డిఫరెంట్ గా వుంటాయి. కరాటే, కుంగ్ ఫూ నుంచి టైక్వాండో...ఇతరత్రా వెరైటీ విదేశీ విద్యలు నేర్చుకుని మరీ తన సినిమాల్లో స్టంట్స్ పెర్ఫామ్ చేస్తుంటాడు పవన్. అదే పవన్ స్పెషాలిటీ కూడా. ఈ మద్యకాలంలో వెరైటీ స్టంట్స్ ని కాస్త తగ్గించిన పవన్, 'పంజా"లో మళ్ళీ ప్రతాపం చూపించబోతున్నాడని సమాచారం. తన ట్రేడ్ మార్క్ బ్యాక్ పుట్ షాట్ ని ఈ సినిమాలో అద్భుతంగా విలన్లపై ప్రయోగించాడట. దాంతో పాటుగా స్టంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి..అందిరిచేతా ఔరా అన్పించబోతున్నాడంటూ పవన్ 'పంజా" గురించి టాలీవుడ్ లో రకరకాల గాసిప్స్ విన్పిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ మేనరిజమ్ ఏదని అడిగితే ఎవరికైనా ఠక్కున గుర్తోచ్చేది..మెడపై చెయ్యి పెట్టుకుని వేలితో రాస్తూ విలన్ కి వార్నింగ్ ఇవ్వడం. బద్రి సినిమాతో మొదలు పెట్టిన ఈ స్టయిల్ ని పవన్ తర్వాత చాలా సినిమాల్లో వాడాడు. పంజా సినిమాతో మళ్లీ పవన్ పూర్వ వైభవం తెచ్చుకుంటాడని ఆశిస్తున్న అభిమానులకి ఈ మెడ మీద చెయ్యితో ఉన్న స్టిల్ చూస్తే వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది. పది వేల వోల్టులు పవర్ వారిలో నిండిపోతుంది. అందుకే ఈ స్పెషల్ స్టిల్స్ పవన్ ఫ్యాన్స్ కోసం.


Click it and Unblock the Notifications











