కాలినడకతో వెంకన్న సేవలో పవన్ కళ్యాణ్

By Srikanya

పవన్ కళ్యాణ్ గురువారం తిరుమలలోని అలిపిరి కాలిబాట పై నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన రాబోయే చిత్రం పులి సక్సెస్ కావాలని మ్రొక్కుబడిగా పవన్ ఈ యాత్ర చేసారు. ఇక ఈ యాత్ర మొదట హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయర్ పోర్ట్ కు బయిలుదేరటంతో మొదలైంది. ఆర్టీసి బస్ స్టాండ్ వద్ద ఉన్న హోటల్ లో మధ్యాహ్నం విడిది చేసారు. ఇక లోకల్ గా ప్రజారాజ్యం యూత్ లీడర్స్ ఈ యాత్రకు పబ్లిసిటీ బాగా చేసారు. దాంతో అలిపిరిలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాబోతున్నారంటూ ఛానెల్స్ వారు స్కోరిగ్స్ తో హడావిడి ప్రారంభంచిరారు. దాంతో అలిపిరి వద్ద చాలా మంది యువత గుమిగూడి సెక్యూరిటీ సమస్య ఏర్పడింది. ఇక సంప్రదాయ షర్ట్,ధోవతితో పవన్ తన హోటల్ రూమ్ నుంచి సాయింత్రం ఆరున్నరకు బయిటకు వచ్చారు. మీడియాను కలవటానికి ఇష్టపడలేదు. ఆయన పర్శనల్ బాడీ గార్డులు, ప్రజారాజ్యం యూత్ వింగ్ లీడర్స్ సర్కిల్ గా ఏర్పడి వెహికల్ ఎక్కించి, అలిపిరి వైపు పోనిచ్చారు. అప్పటితే తమ అభిమాన నాయకుడుని చూడటానికి అలిపిరి వద్ద వందల మంది గుమిగూడి ఉన్నారు. వారితో ఏమీ మాట్లాడకుండా పవన్ కాలిబాట ద్వారా ముందుకు నడిచారు. ఆయన్ని దాదాపు ఇరవై మందితో కూడిన సెక్యూరిటీ టీమ్ అనుసరించింది. గాలిగోపురం వద్ద లోకల్ మీడియా ఆయన్ని కలవటానకి ప్రయత్నించింది. అయితే అక్కడా పవన్ పెదవి విప్పలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X