పవన్ ‘అత్తారింటికి దారేది' లీక్డ్ ఫోటోలు (కొత్తవి)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
ఈ చిత్రానికి సంభందించిన కొన్ని ఫోటోలు లీకయ్యాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ ఫోటోలు వేగంగా ఫ్యాన్స్ ను చేరుకుని,వారి అభిమానాన్ని చూరకొంటున్నాయి. వీటిని చూసి ఫ్యాన్స్ ఎలాంటి కథ అయ్యింటుందనే అభిప్రాయానికి వస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కారు డ్రైవర్ గాకనిపిస్తాడని, బ్రహ్మానందం అసెస్టెంట్ గా చేస్తాడని చెప్పుకుంటున్నారు. పూర్తిగా కొత్త తరహా కామెడీతో త్రివిక్రమ్ ఈ స్క్రిప్టుని రాసాడని,పవన్ గబ్బర్ సింగ్ రేంజిలో హిట్ కొడతాడని చెప్తున్నారు.
స్లైడ్ షోలో ఆ ఫోటోలు..

హార్డ్లీ డేవిడ్ సన్ బైక్ పై పవన్ కళ్యాణ్ ...ఫిల్మ్ సిటిలో

హైదరాబాద్ షేక్ పేట,GNITS వద్ద పవన్,సమంత ఓ బైక్ పై వెళ్తూండగా ...

కాట్రవల్లి అలీ,సమంత కలిసి...ఇలా

రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటి సెట్...

రైల్వే స్టేషన్ సెట్ లో సమంత,పవన్

సేమ్ లొకేషన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటూ...

ఖుషీ నాటి జల్సాని అందిస్తాననే భరోసాతో..పవన్...


Click it and Unblock the Notifications











