పవన్ మళ్ళీ జల్సా
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు సమాచారం. మహేష్ తో తాను రూపొందిస్తున్న వరుడు చిత్రం అనంతరం ఈ చిత్రం ఉండవచ్చునని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'కొమరం పులి" చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నా రు.90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. 'కొమరం పులి" చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాల్సి వుండగా పూరి జగన్నాథ్ వేరే చిత్రాల షూటింగ్‌లో బిజీగా వుండటం వలన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ బావిస్తున్నట్లు తాజా సమాచారం.
pawan kalyan trivikram mahesh puli puri jalsa పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా కొమరం పులి దీపావళి


Click it and Unblock the Notifications