పవన్ అభిమానులకు మరో తీపి కబరు

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా వస్తుందన్న విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారికి మరో తీపి కబురు. పవన్ తో కలిసి జల్సా లాంటి ఎంటర్‌టైన్మెంట్ హిట్ సాధించిన దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా ఆయనతో చేయబోతున్నాడని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. తాజా ఆ విషయం కన్ ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్-ఇలియాన జంటగా ఓ సినిమా రూపొందిస్తున్న త్రివిక్రమ్ ఈ చిత్రం తర్వాత పవన్ సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్టయిన సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా చిత్రం అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో గబ్బర్ సింగ్ పైనే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ హిట్ లేనే లేదు. పూరి జగన్నాథ్ ద్వారా అధి సాధ్యమని చాలా మంది అభిమానులు అభిప్రాయం పడుతున్నారు. మరి పూరి జగన్నాథ్ ప్రకటన చేశారు కానీ...పవన్ ఈ సినిమాకు ఒప్పుకున్నాడా? లేదా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X