పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో.. కథలు సిద్ధంగానే ఉన్నాయట.. కానీ?

ప్రతి స్టార్ హీరోకు ఒక బెస్ట్ డైరెక్టర్ చాలా క్లోజ్ గా ఉంటాడు. కొన్నిసార్లు హీరోలు ఎంచుకునే ప్రతి కథలో వారికి నచ్చిన దర్శకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. ఇక ఆ విధంగా చాలా క్లోజ్ గా ఉండే వారిలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చేసింది మూడు సినిమాలే అయినా పవన్ చాలా వరకు త్రివిక్రమ్ సెలక్షన్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక వీరి కాంబినేషన్ లో నాలుగవ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 రాజకీయాల్లో త్రివిక్రమ్ పాత్ర..

రాజకీయాల్లో త్రివిక్రమ్ పాత్ర..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రమంలో చాలా వరకు త్రివిక్రమ్ పాత్ర ఉందని అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. డైలాగ్స్ రాసిచ్చేవారని కూడా కామెంట్స్ చేశారు. కానీ త్రివిక్రమ్ పరిచయం కావడం కంటే ముందు నుంచే మంచి భావాలు కలిగిన వ్యక్తి. నిత్యం సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అని చాలా మంది చెబుతుంటారు.

 కాంబినేషన్ పై అంచనాలు

కాంబినేషన్ పై అంచనాలు

అసలైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా పవన్ కళ్యాణ్ తోనే చేయాల్సింది. కానీ పవన్ ఆ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఆ తరువాత జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో వారు మరింత దగ్గరయ్యారు. ఇక కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

నాలుగవ సినిమా ఎప్పుడు?

నాలుగవ సినిమా ఎప్పుడు?

అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ ఒపెనింగ్స్ నెవర్ బిఫోర్ అనేలా వచ్చాయి. జస్ట్ యావరేజ్ అనే టాక్ వచ్చినా కూడా సినిమా రికార్డులు సరికొత్త ట్రెండ్ సెట్ చేసేవి. ఏదేమైనా పవన్, త్రివిక్రమ్ కాంబో అంటే అంచనాలు అంతకు మించి అనేలా పెరిగిపోతున్నాయి. ఇక నాలుగవ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అందుకే ఆలస్యం అవుతోంది?

అందుకే ఆలస్యం అవుతోంది?

నిజానికి ఈ పవర్ఫుల్ కాంబినేషన్ లో ఈపాటికే సినిమా రావాలి. కానీ త్రివిక్రమ్ మళ్ళీ పొరపాటు చేయాలని అనుకోవడం లేదు. రెండు మూడు కథలను కూడా సిద్ధం చేశాడట. కానీ ఆ స్టోరీలను తెరకెక్కించాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుందట. కానీ పవన్ ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమాకి మూడు నెలలకు మించి కాల్షీట్స్ ఇవ్వడం లేదు. అందుకే మాటల మాంత్రికుడు ఆయన డేట్స్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ లేదని వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
 ఇక వచ్చే ఎలక్షన్స్ తరువాతే..

ఇక వచ్చే ఎలక్షన్స్ తరువాతే..

ఇప్పట్లో అయితే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం లేదు. పవన్ వకీల్ సాబ్ తో పాటు నెక్స్ట్ వరుసగా మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. వచ్చే ఎన్నికల వరకు ఈ సినిమాలు ఉంటాయి. ఆ తరువాత మళ్ళీ బిజీ కావచ్చు కాబట్టి పవన్ త్రివిక్రమ్ కాంబో ఇక వచ్చే ఎలక్షన్స్ తరువాతే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X