»   » పవన్-త్రివిక్రమ్ మూవీ ఆడియో డేట్

పవన్-త్రివిక్రమ్ మూవీ ఆడియో డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం ఆడియో జులై 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డేట్ అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

మరో ముఖ్య విషయం ఏమిటంటే...ప్రస్తుతం జరుగుతున్న యూరఫ్ షెడ్యూల్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అదే విధంగా అత్తారింటికి దారేది అనే వర్కింగ్ టైటిల్ మార్చి మరో టైటిల్ ఖరారు చేయనున్నారు. స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా తదితర యూరప్ దేశాల్లోన్ని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుగుతోంది.

రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు ప్లాన్ చేసారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary
Power Star Pawan Kalyan-Trivikram Srinivas movie audio release is likely on 14th July. The movie will hit the theaters on August 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu