For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్-త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. హీరో,హీరోయిన్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం వేట సాగుతోంది.

    పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ నవంబర్ 23 ఫిల్మ్ నగర్లో జరిగింది. ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.

    నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఫొటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ఆర్ట్ రవీందర్, కో ప్రొడ్యూసర్స్ భోగవల్లి బాపినీడు, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్

    ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.

    English summary
    The regular shooting of Pawan Kalyan-Trivikram film will commence from the second week of in Hyderabad. The family entertainer has Samantha playing the female lead and producer BVSN Prasad is currently searching for the second heroine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X