పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్(ఫోటోలు)
హైదరాబాద్: పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ ఈ రోజు(నవంబర్ 23) ఫిల్మ్ నగర్లో జరిగింది. ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.

పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా తొలి షాట్ ను వెంకటేశ్వర స్వామి విగ్రహంపై చిత్రీకరించారు.

నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

డిసెంబర్ రెండవ వారం నుంచీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

జల్సా వంటి సూపర్ హిట్ తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది.

చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఫొటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ఆర్ట్ రవీందర్, కో ప్రొడ్యూసర్స్ భోగవల్లి బాపినీడు, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్

రచ్చ దర్శకుడు సంపత్ నంది ఈ పూజకు హాజరయ్య తన విషెష్ ని తెలియచేసారు.

చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోయినా ‘సరదా' పేరుతో పిలుస్తున్నారు.

సాధారణంగా ఏ సినిమా ఓపెనింగ్ అయినా హడావుడిగా, అందరికీ తెలిసేలా, మీడియాను ఆహ్వానించి మరీ చేస్తారు. అలాంటి దేమీ లేకుకండా మీడియా వారికి ఈ పూజ షాకిచ్చేలా చేసింది.


Click it and Unblock the Notifications











