పవన్, త్రివిక్రమ్ సినిమా ఆగస్టులో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అదే తరహాలో మంచి ఎంటర్‌టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయి.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జులాయి చిత్రానికి దర్శకత్వం వహిస్త్తూ బిజీగా గడుపుతున్న త్రివిక్రమ్ మరో వైపు పవన్ చిత్రానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. జల్సా చిత్రంలో పవన్‌తో నటించిన ఇలియానాను ఇందులోనూ తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం ఫైనలైజ్ కాలేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' విడుదలపై ఆసక్తిగా ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేని పవన్....'గబ్బర్ సింగ్' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈచిత్రం పవర్ స్టార్ కెరీర్లో పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందని ఇటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మాసివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్‌తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి కమిట్ అయ్యాడు. ఇందులో పవన్‌తో తమన్నా రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా.....పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











