పవన్, త్రివిక్రమ్: ఈ టైటిల్ వర్క్ అవుట్ అవుతుందా..?

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాకు "రాజు వచ్చినాడు" అని త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వెలువడుతున్నాయి

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుండగా ముఖ్య పాత్రలో చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో ఖుష్బూ కనపడనుంది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీ అత్తారింటికి దారేది తరహాలో ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది అని టాక్.

చాలా పేర్లు వినిపించాయి

చాలా పేర్లు వినిపించాయి

సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండడంతో అభిమానాలు ఆ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కి టైటిల్ ఇదేనని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందులో మొదటగా ఇంజనీర్ బాబు.. గోకుల కృష్ణుడు.. దేవుడే దిగి వచ్చినా.. అంటూ చాలా పేర్లు వినిపించాయి.

Recommended Video

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
చుట్టేద్దాం రారండోయ్

చుట్టేద్దాం రారండోయ్

మొన్నామధ్యన చుట్టేద్దాం రారండోయ్ అనే టైటిల్ కూడా విన్నాం. ఇక లేటెస్ట్ గా మరో కొత్త టైటిల్ ఇదేనంటు ప్రచార సాగుతోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పుడుహాట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఒకరు ఇంజనీర్ బాబు అని స్వంతంగా తయారు చేసిన పోస్టర్ చూసి అదే నిజం అనుకున్నారు అందరు.

దేవుడే దిగివచ్చినా

దేవుడే దిగివచ్చినా

నిజానికి ఆపోస్టర్ చాలా బాగా వచ్చింది.. కాని అది నిజం కాదని ఆ తర్వాత తెలిసింది. షూటింగ్ మొదలు పెట్టడానికి చాలా రోజుల ముందు నుంచే దీనికి దేవుడే దిగివచ్చిన అనే పేరు బాగా ప్రచారం లో ఉంది. కాని ఇప్పుడు అది దీనికి సూట్ కాదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

రాజు వచ్చినాడు

రాజు వచ్చినాడు

ఈ సినిమాకు "రాజు వచ్చినాడు" అని త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా చిత్ర యూనిట్ ని నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర నిర్మాత రాధాకృష్ణ. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యూల్ నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ భారీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X