హ్యాపీ న్యూస్ :పవన్,త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఖరారు
ఇందులో హీరోయిన్ గా చేస్తున్న సమంత ట్విట్టర్‌లో తను చేస్తున్న సినిమాల గురించి చెబుతూ... పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేస్తున్న 'అత్తారింటికి దారేది' అంటూ టైటిల్‌ని ప్రస్తావించింది. దాంతో ఈ సినిమాకు ఆ టైటిలే ఓకే అయ్యిందని అభిమానులు రూఢీ చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకూ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఈ చిత్రంలో మరో విశేషం ఉంది. పవన్‌కల్యాణ్ ఈ చిత్రంలో ఓ పాట పాడబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ఓ బాణీకి పవన్ గాత్రం అయితేనే బాగుంటుందని స్వరకర్త భావించారట. ఆ మేరకు హీరోని ఒప్పించారు. దేవిశ్రీ గతంలోనే పవన్‌తో 'జల్సా'లో ఓ పాట పాడించాలనుకొన్నారు. కానీ వీలుపడలేదు.
పవన్‌కి పాటలు పాడటం కొత్తేమీ కాదు. తమ్ముడు, ఖుషిల్లో జానపద బాణీల్లో సాగే బిట్ సాంగ్స్ పాడారు. అలాగే 'జానీ'లోనూ గొంతు విప్పారు. ఆ తరవాత పాడుతున్నది ఈ చిత్రం కోసమే.
'అత్తారింటికి దారేది?' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఈ నెలాఖరున విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో చిత్రించబోతున్నారు. వచ్చే నెల 5 నుంచి అక్కడే షూటింగ్ సాగుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












