»   » కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ స్పీడు...!

కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ స్పీడు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పీడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగులు ఎంత స్లోగా నడిచేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇపుడు మాత్రం పరిస్థితి వేరు. ఆయన తాజాగా మూవీ 'కాటమరాయుడు' విడుదలై వారం అయిందో లేదో మరో కొత్త సినిమా షూటింగులో బిజీ అయ్యారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సినిమా ఇప్పటికే కొన్ని లాంచనంగా ప్రారంభం అవ్వగా... సోమవారం(ఏప్రిల్ 3) నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

కాఫీ షాపులో హీరోయిన్ తో

కాఫీ షాపులో హీరోయిన్ తో

ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు. సోమవారం తొలి రోజు షూట్ ఓ కాఫీ షాపులో జరిగింది. పవన్ కళ్యాణ్-అను ఇమ్మానియేల్ పై కొన్ని సీన్లు చిత్రీకరించారు. నేటి నుండి (ఏప్రిల్ 4) కీర్తి సురేష్‌ కూడా షూటింగులో పాల్గొంటుందని సమాచారం.

మూవీ షెడ్యూల్ డిటేల్స్

మూవీ షెడ్యూల్ డిటేల్స్

సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే 5 రోజుల పాటు సాగనుంది. ఒక చిన్న గ్యాప్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది.

ఖుష్భూ కీలక పాత్ర

ఖుష్భూ కీలక పాత్ర

ఈ సినిమాలో ప్రముఖ నటి ఖుష్బూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్-త్రివిక్రమ్ గత మూవీలో నదియా మాదిరిగా.... ఖుష్భూ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

హాట్రిక్ ఖాయమేనా?

హాట్రిక్ ఖాయమేనా?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం హాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకంలో ఉన్నారు అభిమానులు.

హారిక హాసిని క్రియేషన్స్

హారిక హాసిని క్రియేషన్స్

హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary
The much-awaited third film of Pawan Kalyan and director Trivikram has begun its regular shoot on April 3rd in Hyderabad. Pawan Kalyan has joined the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu