పవన్ - త్రివిక్రమ్ ‘సరదా’ తీరుతుందా?

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన 'జల్సా' మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ మరో సినిమా చేయాలని సరదా పడుతున్నారు. విచిత్రంగా ఈ సినిమాకు కూడా 'సరదా' అనే టైటిల్ ఖరారు చేశారట. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని పంజా నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, నగేష్ ముంత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పంజా సినిమా అనుకున్న అంచనాలు అందుకోక పోవడంతో....'సరదా' ద్వారా పోయిన డబ్బులు పిండుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

పవర్ స్టార్ గతంలో నటించిన ఖుషి, జల్సా మాదిరి పూర్తి ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో 'సరదా' చిత్రాన్ని రూపొందిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు పవర్ స్టార్ పవర్ తోడైతే సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పవర్ స్టార్ పరిశ్రమలో వెలిగిపోవడం ఖాయం. మరి వీళ్ల 'సరదా' ఏ మేరకు తీరుతుందో చూడాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హారిష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. హిందీ దబాంగ్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈచిత్రంలో శృతి హాసన్ నాయికగా నటిస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X