త్రివిక్రమ్‌కు పవన్ కల్యాణ్ డెడ్‌లైన్.. కారణం అదేనా..
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన పార్టీని సర్వసిద్దం చేస్తన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటిప్పుడే పార్టీ కార్యాలయాన్ని ఆధునిక హంగులతో తీర్చి దిద్దుతున్నాడు. వేగంగా సిని
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన పార్టీని సర్వసిద్దం చేస్తన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటిప్పుడే పార్టీ కార్యాలయాన్ని ఆధునిక హంగులతో తీర్చి దిద్దుతున్నాడు. వేగంగా సినిమాలను పూర్తి చేయాలనే దృష్టితో ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు డెడ్‌లైన్ విధించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ డైడ్ లైన్ ఏమిటంటే..

నత్త నడకన పవన్ చిత్రం
పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం చాలా నత్త నడకన సాగుతున్న విషయం తెలిసిందే. దసరా బరిలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. సంక్రాంతి వరకు సాగదీశారు.

చిక్ మగుళూర్‌లో షెడ్యూల్
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను చిక్‌మగళూర్‌లో పూర్తి చేసుకొని వచ్చారు. ఈ షెడ్యూల్‌లో చాలా మంది నటీనటులు పాల్గోన్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేసినట్టు సమాచారం.

అక్టోబర్ 21న యూరప్‌కు
పీఎస్‌పీకే25 అని వ్యవహరిస్తున్న ఈ చిత్ర యూనిట్ అక్టోబర్ 21న యూరప్‌కు వెళ్తున్నది. నవంబర్ 15 వరకు అక్కడ షూటింగ్ నిర్వహిస్తారనేది తాజా సమాచారం. ఈ షెడ్యూల్‌లో భారీ తారాగణం పాల్గొనే అవకాశం ఉంది.

త్వరగా పూర్తి చేయాలి
సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి అని దర్శకుడు త్రివిక్రమ్‌కు పవన్ కల్యాణ్ ఇటీవల సూచించాడట.

సంక్రాంతి బరిలో పవన్
అంతేకాకుండా, ఆరు నూరైనా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని డెడ్‌లైన్ విధించాడన్న వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది. హారిక అండ్ హాసిని బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా ఎస్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు.

పవన్ కోసం రాంచరణ్ రాజీ
ఇక బాబాయ్ పవన్ కల్యాణ్ చిత్రం సంక్రాంతి బరిలో ఉన్నందున్న అబ్బాయి రాంచరణ్ తన చిత్రం రంగస్థలంను వాయిదా వేసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తన చిత్రాన్ని రాంచరణ్ వేసవి సెలవుల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆ వార్త సారాంశం.


Click it and Unblock the Notifications











