పవన్, త్రివిక్రమ్ చిత్రం గురించి లేటేస్ట్ న్యూస్.. పవిత్ర పుణ్యక్షేత్రంలో టైటిల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది.

By Rajababu

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రాన్ని 2018 జనవరి 10వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్‌పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రకరకాల పేర్లు మీడియాలో వినిపిస్తున్నప్పటికీ.. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ చిత్ర టైటిల్ ప్రకటన గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది.

టైటిల్ గురించి ఆసక్తి

టైటిల్ గురించి ఆసక్తి

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తికావొచ్చింది. డిసెంబర్‌లో పాటల చిత్రీకరణకు చిత్ర యూనిట్ వెళ్లనున్నది. సినిమా షూటింగ్ ఫినిషింగ్ టచ్‌కు వచ్చినప్పటికి సినిమా టైటిల్ ఏమిట‌నే విషయాన్ని ప్రకటించకపోవడంతో అభిమానుల ఆలోచ‌న‌ల‌కు అంతేలేకుండా పోతుంది.

వారణాసిలో టైటిల్ ప్రకటన

వారణాసిలో టైటిల్ ప్రకటన

పవన్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటున్నారు. ప్ర‌స్తుతం అజ్ఞాతవాసి అనే వ‌ర్కింగ్ టైటిల్‌ జోరుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చిత్ర టైటిల్‌ని వార‌ణాసిలో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

వచ్చేవారం వారణాసిలో షూట్

వచ్చేవారం వారణాసిలో షూట్

సినిమా చివ‌రి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వ‌చ్చేవారం వార‌ణాసికి వెళ్ల‌నున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన బాణీల‌ను డిసెంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో 'బైటికొచ్చి చూస్తే' అనే పాటను త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పాట అటు మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.

మళ్లీ పవన్ కల్యాణ్ పాట

మళ్లీ పవన్ కల్యాణ్ పాట

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పాట పాడబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. 'కొడకా కోటీశ్వరవా..' అనే పాటను పవన్ పాడనున్నాడనేది తాజా సమాచారం. గతంలో కూడా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా' అనే పాట పాడిన సంగతి తెలిసిందే.

కీర్తీ, అను హీరోయిన్లుగా

కీర్తీ, అను హీరోయిన్లుగా

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేనర్‌పై రూపొందుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X