పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ అభిమానులకు హ్యాపీ న్యూస్
పవన్-త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఆగస్టు 15న టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.
ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. సో.... జెండా పండగ రోజు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అభిమానులకు సంతోషకరమైన న్యూస్ అందబోతోంది అన్నమాట.

ఈ సినిమా ఎలా ఉండబోతోంది? కాన్సెప్టు ఏమిటి? అనే వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్ తర్వాత ఇందుకు సంబంధించిన విషయాలపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











