పవన్ మూవీ టైటిల్‌పై సస్పెన్స్ వీడింది..!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా రిలీజ్ డేట్ ఖరారైనా....సినిమా టైటిల్‌పై మాత్రం దర్శక, నిర్మాతలు ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఈ సస్పెన్స్ వీడినట్లే కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న 'అత్తారింటికి దారేది' అనే టైటిలే ఈ చిత్రానికి ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఇటీవల ఈ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించడమే ఇందుకు నిదర్శనం. వినడానికి ఈ టైటిల్ కాస్త వింతగా, అదో రకంగా, పవర్ స్టార్ ఇమేజ్‌కు తగిన విధంగా లేక పోయినా...ఆ టైటిల్ సినిమా కథ, కథనానికి బాగా సూటవుతుందని అంటున్నారు.
ఇటీవల 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైటిల్ ను మొదట్లో కాస్త వింతగా చూసారు. ఆ తర్వాత ఆ టైటిలే సూపర్ హిట్టయింది. ఇటీవల ఎన్టీఆర్ సినిమాకు కూడా 'రామయ్యా వస్తావయ్యా' అనే టైటిల్ ఫిక్స్ చాసారు. ఈ నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ కూడా సినిమాకు ప్లస్సవుతుందనే వాదన వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











