»   »  ‘వాక్ ఫర్ హార్ట్‌’లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ నక్లెస్ రోడ్

‘వాక్ ఫర్ హార్ట్‌’లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ నక్లెస్ రోడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చారిటీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హృదయ స్పందన ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'వాక్ ఫర్ హార్ట్, రీచ్ ఫర్ హార్ట్' కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మార్చి 2, 2014న ఉదయం 6 గంటలకు పి.వి.గాట్ నుండి నక్లెస్ రోడ్ వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు రూ. 300 చెల్లించి పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. పాసులు అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని హృదయ స్పందన ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. పాసులు కావాలనుకునే వారు "#8-3-729/730,3rd ఫ్లోర్, శ్రీసాయి మణికంఠ నిలయం, బిసైడ్ లా కాలేజ్, ఎల్లారెడ్డిగూడ, అమీర్ పేట, హైదరాబాద్" అడ్రస్‌ను సంప్రదించాలి.

Pawan kalyan, Trivikran for Walk for Heart, Reach for Heart

ఈ కార్యక్రమానికి ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, శ్రేయాస్ మీడియా సహకారం అందిస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరవుతున్న నేపథ్యంలో అభిమానుల నుండి భారీ‌గా స్పందన వస్తుందని భావిస్తున్నారు. 'వాక్ ఫర్ హార్ట్, రీచ్ ఫర్ హార్ట్' కార్యక్రమం సవ్యంగా సాగేందుకు నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు పోలీసులు సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు.

English summary
Hrudaya Spandana Foundation is organising "Walk for Heart, Reach for Heart" with Pawan Kalyan and Trivikram Garu on 2nd March 2014 from 6am Onwards at P.V Ghat, Necklace Road, Hyd. Event is Organised by Prajahitha Social Service Organisation and Supoorted by Shreyas Media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu