twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానిపై దాడి: స్పందించిన పవన్ కళ్యాణ్, మీటింగ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి ఘటన తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. నేను స్వయంగా వెళ్లి కలుస్తాను. ఇలాంటి జరుకుండా చూడాలని రిక్వెస్ట్ చేసారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    ‘నిన్న ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో అభిమానిపై జరిగిన దాడి ఘనటన నన్ను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా వెళ్లి కలుస్తాను. భవిష్యత్తులో ఇలాంటి జరుగకుండా చూడాలని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సేఫ్టీ నాకు అత్యంత ముఖ్యమైన విషయం' అని ట్వీట్ చేసారు.

    Pawan Kalyan tweet about attack

    గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ హడావిడిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. హయత్‌నగర్‌లోని గంటవారిపాలెంలో నివాసముంటున్నాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.

    English summary
    "Yesterday's unfortunate incident where one of our fans was attacked at the audio function of 'Gopala Gopala'has disturbed me a lot. I am going to meet him personally once he gets discharged from the Hospital. I humbly request you all to avoid such incidents in the future. Your safety is my 'PRIORITY'" Pawan Kalyan tweeted,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X