‘కొడకా...’: పోలెండ్ బుజ్జిగాడికి పవన్ రిప్లై, తెర వెనక ఎవరున్నారు?
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 8.3 మిలియన్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిగ్స్ బుజ్జి అనే కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది.

థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్
"డియర్ జెబిగ్స్ బుజ్జీ... మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్విచ్చిన న్యూ ఇయర్ గిఫ్టుకు థాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది. గాడ్ బ్లెస్ యూ'' అంటూ పవన్ కళ్యాణ్ తన మూవీస్ యాక్టివిటీ ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు.

సెవెంత్ హెవెన్లో పోలెండ్ పోరగాడు
స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి రిప్లై రావడంతో పోలండ్ పోరగాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. తాను సెవెంత్ హెవెన్లో తేలియాడుతున్నట్లు ట్వీట్ చేశాడు.

జనవరి 9న పవర్ స్టార్ ఆంథెమ్ రిలీజ్ చేస్తాడట
అంతే కాదు... జనవరి 9వ తేదీన పవన్ కళ్యాణ్ ఆంథెమ్ విడుదల చేస్తానని, దీన్ని తానే స్వయంగా కంపోజ్ చేసి పాడుతానని పోలండ్ కుర్రాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
బుజ్జిగాడి పాటకు మంచి స్పందన
బుజ్జిగాడు పాడిన పాటకు మంచి స్పంద వస్తోంది. దాదాపు 60 వేల మంది చూశారు. దాదాపు 10 వేలకు పైగా లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. దీంతో పాటు వందల్లో అప్రిషియేషన్ కామెంట్స్ వచ్చాయి.

బిజ్జిగాడి వెనక ఎవరు ఉన్నారు?
అయితే ఈ బుజ్జిగాడి వెనక ఎవరో తెలుగు వారు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూకెలో ఉండే తెలుగు వారు ఎవరో ఈ బుజ్జిగాడితో కావాలనే ఈ సెన్సేషన్ క్రియేట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు మహా సభల గురించి కూడా...
ఇటీవల హైదరాబాద్ లో తెలుగు మహా సభలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఈ పోలండ్ కుర్రాడు ట్వీట్లు చేశాడు. తెలుగు చాలా గొప్ప బాష అంటూ ప్రశంసలు గుప్పించాడు. తమ బాషే సరిగా తెలియని 8 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడికి తెలుగు బాష గురించి, ఇక్కడ జరిగే తెలుగు ప్రపంచ మహా సభల గురించి తెలిసే అవకాశమే లేదని,..... ఎవరో తెలుగు వారు ట్విట్టర్లో సెన్షేషన్ కోసమే ఇదంతా అతడితో చేయిస్తున్నారని స్పష్టం అవుతోంది.
అఖిల్ సినిమా పాటకు కూడా
అక్కినేని యువ హీరో అఖల్ నటించిన ‘హలో' మూవీలో పాటన కూడా ఈ పోలెండ్ బుజ్జిగాడు పాడాడు. దీన్ని బట్టి ఈ పోలండ్ కుర్రాడి వెనక ఎవరో తెలుగు సినిమా అభిమాని, తెలుగు భాషాభిమాని ఉన్నట్లు స్పష్టమవుతోంది.

రాజమౌళి, కేటీఆర్, చంద్రబాబు ప్రస్తావన
అంతే కాదు... తెలుగు మహా సభలు జరిగిన సమయంలో దర్శకుడు రాజమౌళి, చంద్రబాబు, కేటీఆర్ ప్రస్తావన తెస్తూ ట్వీట్ చేశాడు. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే పోలండ్ కుర్రాడి వెనక ఎవరో తెలుగు వ్యక్తి ఉన్నట్లు తేలిపోయింది.


Click it and Unblock the Notifications











